telugu navyamedia
సినిమా వార్తలు

ఆగస్ట్ 15న అల్లు అర్జున్ అభిమానులకు ట్రీట్

AA19

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 19వ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. హారికా హాసినీ, గీతా ఆర్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. వ‌చ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు “అల‌క‌నంద‌” అనే టైటిల్ అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందుతున్న‌ ఈ చిత్రంలో సుశాంత్‌, నివేదా పేతురాజ్ కీలక పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఏఏ19గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్‌ను ఆగస్ట్ 15న రివీల్ చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పటికే పలు పేర్లు ఈ సినిమాకి వినిపించిన తరుణంలో యూనిట్ ఏం టైటిల్ ప్రకటిస్తారో.. అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఏఏ19 అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది నిజంగా సూపర్బ్ ట్రీటే. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్నాడని సమాచారం. 40 ఇయర్స్ ప్లస్ ఏజ్‌లో ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో నటిస్తున్నాడని, ఆ పాత్ర ఈ సినిమాకి ఎంతో కీలకం అని టాక్ నడుస్తోంది.

Related posts