telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్

Shooting

హైదరాబాద్‌లో కరోనా మహమ్మారి ఎలా విజృంభిస్తుందో తెలిసిన విషయమే. టీవీ సీరియల్స్ షూటింగ్‌లో కరోనా నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్ల ఇప్పుడొక నటుడికి కరోనా వ్యాపించినట్లుగా తెలుస్తుంది.ప్రముఖ చానల్‌లో ప్రసారమయ్యే సీరియల్ నటుడికి కరోనా సోకింది. జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడుతున్న అతడికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో నిర్మాతలు ఆ సీరియల్‌ షూటింగ్‌ను నిలిపివేశారు. యూనిట్ సభ్యులందరిని క్వారంటైన్‌కు పంపించినట్టుగా సమాచారం. కరోనా సోకిన నటుడు.. మరో చానల్‌లో ప్రసారమయ్యే సీరియల్‌లో కూడా నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ నటుడు ఇప్పటివరకు ఎవరెవరిని కలిసారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Related posts