telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో అరుదైన రికార్డును సాధించిన “రాములో రాములా” సాంగ్

Rmaulo-Ramula

ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని పాటలకు వచ్చిన ప్రేక్షకాదరణ అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలోని పాటలు ఆదరణ పొందడం విశేషం. అయితే ఈ మధ్య ఈ సినిమా నుండి ఒక్కొక్క వీడియో సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలోని ‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’ సాంగ్స్ తో పాటుగా ‘రాములో రాములా’ వంటి ఫుల్ మాస్ సాంగ్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. విడుదలైన క్షణం నుండే దుకుకపోతున్న ‘రాములో రాములా’ లిరికల్ సాంగ్ 300 మిలియన్స్ మార్క్ ను క్రాస్ చేసింది. ఇప్పటివరకు మన సౌత్ ఇండియాలో ఏ సినిమా లిరికల్ సాంగ్ కూడా ఈ ఫిట్ ను అందులేదు. దాంతో 300 మిలియన్స్ సాధించిన లిరికల్ సాంగ్ గా ‘రాములో రాములా’ రికార్డు సాధించింది. ఇక బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Related posts