telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

చివరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ చేసిన మామ… అల్లుడి రియాక్షన్ ?

సౌదీలో ఓ వ్యక్తి తన కూతురి పెళ్లి కోసం అన్నీ ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేశాడు. బంధువులు, స్నేహితులను పెళ్లికి భారీగానే పిలిచాడు. కానీ చివరి నిమిషములో తనకు కాబోయే అల్లుడితో ఈ పెళ్లి ఫంక్షన్ క్యాన్సిల్ చేద్దామని చెప్పడంతో అతడు షాకయ్యాడు. డైరెక్ట్‌గా మ్యారేజ్ పత్రాలపై సంతాకాల అనంతరం అతిథులకు భోజనాలు పెట్టేస్తే సరిపోతుందన్నాడు. అది విన్న అల్లుడికి మొదట ఏమీ అర్థం కాలేదు. ఆ తరువాత మామ చెప్పిన వివరణతో అల్లుడు కూడా కన్విన్స్ అయ్యాడు. మిగతా కార్యక్రమాలన్నింటినీ క్యాన్సిల్ చేయడం వల్ల మిగిలిన డబ్బును వేరే మంచి పనికి వినియోగిద్దామని అల్లుడికి నచ్చజెప్పాడు మామ. దీనికి అల్లుడు ఒప్పుకోవడంతో పెళ్లికి వచ్చిన అతిథులు కూడా మామ-అల్లుడి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సౌదీలో ఉండే సౌద్ అల్ మలేకి అనే వ్యక్తి ఇలా తన కూతురి పెళ్లి ఫంక్షన్‌లో వృధా ఖర్చులకు సంబంధించిన కార్యక్రమాలను క్యాన్సిల్ చేసి వార్తల్లో నిలిచారు. అలాగని అల్లుడికి ఏం తక్కువ చేయలేదు. కట్న కానుకలు భారీగానే ఇచ్చాడు.

Related posts