రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇకమీదట ఎవరైనా పదేపదే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే అధిక మొత్తంలో వాహన బీమా ప్రీమియం కూడా చెల్లించాల్సి రావచ్చు. ట్రాఫిక్ నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసేందుకు గాను బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఈ ఆలోచన చేస్తోంది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఐఆర్‌డీఏఐ, భారత బీమా ఇన్ఫర్మేషన్ బ్యూరో, దిల్లీ ట్రాఫిక్ పోలీసు విభాగం, వివిధ బీమా కంపెనీల ప్రతినిధులతో కూడిన 9 మంది సభ్యుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది.
దిల్లీలో తొలుత ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనుంది. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే.. బండి నడిపే విధానం, జరిగిన ప్రమాదాలు, జారీ అయిన ట్రాఫిక్ చలానాలు వంటి అంశాల ఆధారంగా బీమా ప్రీమియంను నిర్ధారిస్తారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
వాళ్లు కూడా మనుషులే… బ్లడీ స్టుపిడ్ పోలీస్