telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డైరెక్టర్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన నితిన్

డైరెక్టర్ వెంకీ కుడుముల పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బెస్ట్ విషెస్ తెలుపుతూ రేంజ్ రోవర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు నితిన్. ఈ బహుమతి స్వీకరించిన వెంకీ కుడుముల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ”ఉత్తమ వ్యక్తితో ఉత్తమైన సినిమాలు తీసినప్పుడు ఇలాంటి ఉత్తమైనవి జరుగుతుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ అన్నా” అని పేర్కొంటూ ఆ కారుతో దిగిన పిక్ షేర్ చేశారు. వెంకీ కుడుముల- నితిన్ కాంబోలో వచ్చిన ‘భీష్మ’ మూవీ సూపర్ డూపర్ హిట్ అందుకుంది. నితిన్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచి రికార్డులు తిరగరాస్తూ కలెక్షన్ల ప్రవాహం పారించింది. ఈ మూవీలో నితిన్ జోడీగా రష్మిక మందన నటించింది. 2020 ఆరంభంలో వచ్చిన ఈ సక్సెస్ గుర్తు గానే నితిన్ తన దర్శకుడు వెంకీ కుడుములకు రేంజ్ రోవర్ కారు బహుమతిగా ఇచ్చారు. నితిన్ ప్రస్తుతం చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ మూవీ చేస్తున్నారు. ‘రంగ్ దే’ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది.

Related posts