telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

కరోనా నుండి కోలుకున్న అల్లు అర్జున్…

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో షూటింగ్ లు ఆగిపోతున్నాయి. అయితే గత నెల 28న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇక తాజాగా జరిపిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ గా నిర్ధారణ అయిందని బన్నీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ‘15 రోజుల క్వారంటైన్ అనంతరం టెస్టులలో కరోనా నెగిటివ్ గా వచ్చింది. నాకోసం ప్రార్థించిన అభిమానులకు, సన్నిహితులకు ధన్యవాదాలు… కరోనా కేసులు తగ్గడానికి ఈ లాక్ డౌన్ పనిచేస్తుందని నమ్ముతున్నాను. అందరు జాగ్రత్తగా ఉండండి’ అంటూ అల్లు అర్జున్ తెలియజేశారు.

Related posts