telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగ చైతన్య సినిమాలో రకుల్ లేదట…!

Rakul

నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే చాలా వరకు లవ్ స్టోరీ షూటింగ్ జరపుకుంది. కారోనా వల్ల ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ‘లవ్ స్టోరీ’ తర్వాత మరో రెండు సినిమాలకు ప్లాన్ చేశాడు చైతూ అందులో భాగంగా ఆయన ‘బంగార్రాజు’ ‘నాగేశ్వరరావ్’ సినిమాల్లో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో వచ్చే ఈ తాజా చిత్రానికి ‘థ్యాంక్యూ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తయారు చేసే పనిలో పడ్డాడట విక్రమ్. ఈ సినిమాలో హీరోయినుగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుందని వార్తలు తెగ ప్రచారం అయ్యాయి. కానీ తాజా సమాచారం ప్రకారం.. రకుల్ పై వచ్చిన వార్తలన్నీ పుకార్లు అని తెలుస్తుంది. ప్రస్తుతం రకుల్ చేతిలో కేవలం డైరెక్టర్ క్రిష్ రూపొందించబోయే తెలుగు సినిమా ఒక్కటే ఉంది. ఇంకా ఏ సినిమా కూడా ఆమె ఓకే చేయలేదు. ఇక మరోసారి ఈ సినిమాలో సమంత ను తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నాడని తెలుస్తోంది. కాగా విక్రమ్ కుమార్ ఇటీవల నానితో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అంతేకాదు గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ ‘మనం’ సినిమా చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విక్రమ్ దర్శకత్వంలో చైతన్య సోదరుడు అఖిల్ ‘హలో’ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయింది.

Related posts