telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

సీఏఏ సభలో రెచ్చిపోయిన యువతి.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు

cca banglore

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా బెంగళూరులో నిర్వహించిన ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్’ కార్యక్రమంలో ఓ యువతి రెచ్చిపోయింది. పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేస్తూ హల్ చల్ చేసింది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగించిన తర్వాత వేదిక ఎక్కి మైక్ వద్దకు వచ్చిన అమూల్య అనే యువతి ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసింది.

వెంటనే అప్రమత్తమైన ఒవైసీ.. ఆమె వద్దకు వచ్చి మైక్ లాక్కుకుని పక్కకు తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమూల్య వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆమెకు ఈ కార్యక్రమానికి సంబంధం లేదని, కార్యక్రమ నిర్వాహకులు ఆమెను ఆహ్వానించలేదని వివరణ ఇచ్చారు. తాము ఎప్పటికీ పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వమని ఒవైసీ స్పష్టం చేశారు.

Related posts