telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎనిమిదవ తరగతి లోనే లవ్ ప్రపోజ్… ఆ తరువాత ఏమైందంటే..!

viswak-sen

‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో విశ్వక్ సేన్.తరువాత ‘హిట్’ చిత్రంతో మెప్పించాడు. హైదరాబాదీ నేటివిటీతో ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రాన్ని రూపొందించారు. అతనే దర్శకత్వ ప్రతిభ చూపిస్తూ ఆ సినిమాలో హీరోగా నటించారు. తాజాగా విశ్వక్ సేన్ ఈటీవీ 2లో ప్రసారం అవుతున్న ‘నీకు మాత్రమే చెప్తా’ టాక్ షోలో తన చిన్న నాటి ప్రేమకథను చెప్పాడు. ఈ షోలో పాల్గొన్న విశ్వక్ సేన్ తన చిన్ననాటి లవ్ మ్యాటర్ బయటపెట్టాడు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించావ్.. మ్యాటర్‌లు ఏం లేవా? అంటే ఈ చిన్ననాటి ప్రేమకథ బయటకు వచ్చింది. విశ్వక్ సేన్ 8వ తరగతిలో ఉన్నప్పుడే ఓ అమ్మాయిని లవ్ చేశాడట. అయితే ఆమె తనకంటే రెండేళ్లు సీనియర్. మనోడు 8వ తరగతి అయితే ఆమె 10 తరగతి. తరగతి పెద్దదని మనోడు అస్సలు తగ్గకుండా వెళ్లి ప్రపోజ్ చేశాడట. ఇంకేం ఉంది మ్యాటర్ క్లాస్ టీచర్‌కి తెలియడంతో ఇద్దర్నీ ఆఫీస్ రూంకి పిలిచారట. అక్కడే విశ్వక్ సేన్‌కి ఆ అమ్మాయితో రాఖీ కట్టించి కథ సుఖాంతం చేశారట.లవ్ స్టోరీని చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్.

Related posts