telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓటీటీలో “కేజీఎఫ్ 2″… స్పందించిన చిత్రబృందం

kgf

క‌న్న‌డ సూప‌ర్ హిట్ చిత్రం “కేజీఎఫ్ 2” కూడా ఓటీటీలో విడుద‌ల అవుతుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. య‌శ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన భారీ బ‌డ్జెట్ చిత్రం కేజీఎఫ్‌. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న కేజీఎఫ్ 2 చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చేసేందుకు రంగం సిద్ద‌మ‌వుతుందని పుకార్లు వ‌చ్చాయి. అమెజాన్ ప్రైమ్, కేజీఎఫ్ 2కి మ‌ధ్య భారీ డీల్ కుద‌ర‌డంతో ఇది సాధ్య‌మైంద‌ని అన్నారు. తాజాగా ఈ వార్త‌ల‌ని ఖండించిన ఫ‌ర్హాన్ అక్త‌ర్ ఓటీటీలో “కేజీఎఫ్ 2″లో విడుద‌ల చేసే ఛాన్స్ ఏ మాత్రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఫ‌ర్హాన్ “కేజీఎఫ్ 2” చిత్రాన్ని హిందీలో విడుద‌ల చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా గ‌త రెండు నెల‌లుగా సినిమా షూటింగ్స్‌, థియేట‌ర్స్ మూత ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో సినీ ప్రేక్ష‌కులే కాక ద‌ర్శ‌క నిర్మాతలు కూడా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంల వైపు దృష్టి సారించారు. ఇప్ప‌టికే తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌కి సంబంధించిన ప‌లు చిత్రాలు డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫాం ‌లో విడుద‌ల‌య్యాయి.

Related posts