telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఎక్స్ ప్రెస్ ఏసీ బోగీల్లో .. ఇబ్బందులు రాకుండా చర్యలు ..

special train between vijayawada to gudur

ఎక్స్ ప్రెస్ ఏసీ బోగీల్లో ఇబ్బందులు రాకుండా రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. హెడ్ ఆన్ జనరేషన్ టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఇబ్బందులు లేకుండా చేయనున్నారు. విశాఖ-ఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్స్ ప్రెస్ కు ఈ టెక్నాలజీని వినియోగించారు. పవర్ జనరేటర్ కార్ల స్థానంలో ‘హెడ్ ఆన్ జనరేషన్’ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తారు.

వాల్తేర్ డీఆర్ఎం చేతన్ కుమార్ చొరవతో ఈ కొత్త టెక్నాలజీ వినియోగంలోకి వచ్చింది. ప్రస్తుతం ఏపీ ఎక్స్ ప్రెస్ లోని ఒక ర్యాక్ కు ఈ విధానం అమలు చేయగా, మిగిలిన మూడు ర్యాక్ లకు త్వరలో అమలు చేయనున్నారు. ఈ సందర్భంగా డీఆర్ఎం చేతన్ కుమార్ మాట్లాడుతూ, ఈ విధానం వల్ల వాయు, శబ్ద కాలుష్యం తగ్గుతుందని అన్నారు.

Related posts