telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మార్చి 12న రానున్న వైల్డ్ డాగ్ ట్రైలర్…

ప్రస్తుతం నాగార్జున అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం లో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా లాక్‌డౌన్ తరువాత నాగార్జున సినిమాల విషయంలో ఎంతో దూకుడు చూపించారు. తను చేస్తున్న షోలను, సినిమా షూటింగ్‌లను చకచకా పూర్తి చేశారు. అయితే నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకొన్నా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ముందుగా అనుకున్నట్లు ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో కాకుండా నేరుగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. మార్చి 12 సాయంత్రం 4:05 గంటలకు ఈ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగార్జున ఎన్ఐఏ ఏజెంట్‌గా కనిపిస్తున్నారు. ఇందులో దియా మీర్జా, సయామీ ఖేర్‌లు నటించగా, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related posts