అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. సమంత సోషల్ చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ బిగ్‌బాస్ షో ద్వారా తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించి అభిమానులను అలరించారు. ఇక ఇప్పటికే వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఓకే చెప్పిన సామ్.. హోస్టుగా కూడా సత్తా చాటాలని కుతూహలంగా ఉంది. అయితే ఇప్పుడు ఆహా కోసం ఫుల్ టైమ్ హోస్ట్‌గా మారింది. ‘సామ్‌జామ్’ పేరుతో ‘ఆహా’ ఓటీటీలో రానున్న ఈ టాక్‌షోకు సామ్ ప్రయోక్తగా వ్యవహరించనుండగా, దీనికి సంబంధించిన తొలి ఎపిసోడ్ ఈ నెల 13న ప్రసారం కానుంది. సామ్ జామ్’ షోతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేందుకు సమంత బాగా కష్టపడుతోంది. దీనిలో భాగంలోనే ఇటీవల ప్లాంట్ బేస్డ్ డైట్‌తో పాటు దానికి సంబంధించి వర్కౌట్స్ మొదలుపెట్టింది. ట్రైనర్ కృష్ణ వికాస్ పర్యవేక్షణలో సామ్ ఈ కఠిన వ్యాయామాలు చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సమంత డెడికేషన్‌కు, ఫిట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే సమంత గతంలో జిమ్‌లో వంద కేజీల బరువును కూడా అవలీలగా మోసిన వీడియోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
previous post