telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ స్టార్ డైరెక్టర్ ప్రభాస్ సినిమా లేనట్టే…?

Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌‌’ షూటింగులో తీరిక లేకుండా ఉన్న ఆయన ఆ తర్వాత నాగ్ అశ్విన్‌తో ఓ సినిమా, బాలీవుడ్ మూవీ ‘ఆది పురుష్’లో నటించనున్నారు. దీంతో పాటు ఆయన ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలొచ్చాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించే అవకావం ఉందని ప్రచారం జరిగింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబో ముందుకెళ్లేలా కనిపించడం లేదు. ప్రస్తుతం చేయాల్సిన సినిమాలకే సుమారు రెండేళ్లు పట్టే అవకాశం ఉండటంతో ఆ తర్వాతే కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పాలని ప్రభాస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తన వద్దకు వచ్చే దర్శక నిర్మాతకు ప్రభాస్ టీమ్ ఇలాగే చెప్పి పంపిస్తోందట. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో కేజీఎఫ్ దర్శకుడితో ప్రభాస్ సినిమా కష్టమేనని తెలుస్తోంది.

Related posts