telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎస్పీ బాలుపై సల్మాన్ ఎమోషనల్ పోస్ట్

Salman

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెన్నై ఎంజీఎం హాస్పిటల్ గురువారం సాయంత్రం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. దీంతో ఆయన అభిమానులు, సన్నిహితుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. అంతా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఆయనతో తనకున్న సంబంధాన్ని పంచుకున్న సల్మాన్ ఖాన్ ఆయన త్వరగా కోలుకోవాలని కోరారు. 1990వ సంవత్సరంలో సల్మాన్ ఖాన్ చిత్రాల కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. “మీరు నా కోసం పాడిన ప్రతి పాటకి ధన్యవాదాలు సార్… మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ సల్మాన్ ట్వీట్ చేశారు. ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని గాయకుడు క్రిష్ తోపాటు చాలామంది ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మరోవైపు కోట్లాదిమంది అభిమానులు ‘బాలు కోలుకోవాలి, క్షేమంగా తిరిగి రావాలి’ అంటూ పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది.

Related posts