telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సూపర్ స్టార్ “మమాంగం” టీజర్ తెలుగులో…

Mamangam

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి తాజాగా భారీ పీరియ‌డ్ డ్రామా “మ‌మాంగం” అనే సినిమా చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మమ్ముట్టి కేర‌ళ సంప్రాదాయ యుద్ధ‌వీరుడిగా క‌నిపించ‌నున్నారు. 17వ శ‌తాబ్ధం నాటి క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఇద్ద‌రు ద‌ర్శ‌కులు తెర‌కెక్కించ‌నున్నారు. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ సంజీవ్ పిళ్ళై ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, రెండో షెడ్యూల్ ఎం ప‌ద్మ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నుంది. ఈ సినిమా మ‌ల‌యాళంతోపాటు తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ విడుద‌ల కాబోతోంది. “మామాంగం” అనే పండుగ సంద‌ర్బంగా జ‌రిగే వివాదం నేప‌థ్యంలో ఈ చిత్రం ఉంటుంద‌ట‌. ఇటీవ‌ల‌ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో యుద్ధ‌వీరుడిగా మ‌మ్ముట్టి లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. ప్రాచీ తెహ్లన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఉన్ని ముకుందన్‌, అను సితార, మాళవికా మీనన్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో మ‌మ్ముట్టి, ఉన్ని ముకుందన్ చేసే క‌త్తి విన్యాసాలు ఆక‌ట్టుకుంటున్నాయి. ప‌లు భాష‌ల‌లో చిత్రాన్ని న‌వంబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమా అభిమానుల‌లో భారీ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.తాజాగా ఈ సినిమా టీజర్ ను తెలుగులో విడుదల చేశారు. మీరు టీజ‌ర్‌పై ఓ లుక్కేయండి.

Related posts