telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అది చెప్పడానికి మీరెవరు ? కౌన్ కిస్కా గొట్టం గాళ్లు… : అలీ ఫైర్

Ali

బుల్లితెరపై హోస్ట్ గా ఓంకార్ మంచి గుర్తింపును దక్కించుకున్నారు. విశేష ప్రేక్షకాదరణ పొందిన ఓంకార్ ఆ తరువాత “రాజుగారి గది” చిత్రంతో దర్శకుడిగా మరి హిట్ అందుకున్నారు. బుల్లితెర‌పై పలు షోస్‌తో ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న ఓంకార్ తెర‌కెక్కించిన హార‌ర్ కామెడీ చిత్రం “రాజుగారి గ‌ది`. ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించింది. ఆ తరువాత ఈ సినిమాకు సీక్వెల్ గా “రాజుగారి గది-2” చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాగార్జున, సమంత కీలకపాత్రల్లో నటించారు. అయితే “రాజుగారిగది” ఆకట్టుకున్నంతగా “రాజుగారి గది-2” ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో భాగం “రాజుగారిగ‌ది 3”. అశ్విన్‌బాబు, అవికాగోర్, అలీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విజయవంతం అయ్యింది. ఈ మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ “ఈ వేదిక మీద ముగ్గురు అన్నదమ్ముల్ని చూశాం. ‘రాజుగారి గది 3’ చూశాం. నెక్స్ట్ 4 కూడా చూస్తాం. నేను తమ్ముడ్ని కాలేను. అన్నను అవుతా. ఈ సినిమాకి పడ్డ కష్టమే ఈ సక్సెస్ మీట్. నేను థియేటర్స్ వెళ్లి సినిమా చూసి చాలా రోజులైంది. ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడాలనుకున్నా. నేను నటించానని కాదు కాని కుకట్ పల్లి బ్రమరాంభ థియేటర్‌కి వెళ్లి సినిమా చూశాం. సినిమా చూస్తే అక్కడే చూడాలనిపించింది. వాళ్లు కల్మషం లేకుండా డబ్బులు పెట్టి చూస్తారు. కాని ప్రివ్యూ షో చూస్తుంటే మన సొమ్ము ఎవడో అవతల వాడు లాగేసుకుంటున్నాడేమో. అందుకే నవ్వరేమో. ఒక వేళ నవ్వాలని మనసులో ఉన్నా బుగ్గలు బిగించి ఉంచుతారే తప్ప నవ్వడం లేదు. అందుకే నేను ఇకపై ప్రివ్యూ షోలు చూడటం మానేస్తున్నా. ఇండస్ట్రీలో పెద్ద హీరో, చిన్న హీరో అని ఉండదు. ఎవర్నైనా కళామ్మతల్లి బిడ్డలాగే చూసుకుంటుంది. తల్లికి పెద్దకొడుకుకైనా చిన్నకొడుకైనా సమానమే. అయితే కొంతమంది పనికట్టుకుని సినిమా బాలేదు.. పెద్దగా ఏం లేదు. మేం ఏదో అనుకున్నాం.. ఏదో ఉంది.. అసలు మీరెవరు సినిమా బాలేదని చెప్పడానికి? మీరెవరు కౌన్ కిస్కా గొట్టం గాళ్లు. చెప్పాల్సింది ప్రేక్షకదేవుళ్లు. వాళ్లు ఎక్కడకు తీసుకుని వెళ్లి ఎక్కడ పెట్టాలి? ఎక్కడికి తీసుకువెళ్లకూడదనేది డిసైడ్ చేసేది వాళ్లు. మేం వాళ్లను నమ్ముకుని మేం బతుకుతున్నాం. ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో.. వాళ్లని నమ్ముకుని మేం ఇండస్ట్రీకి రాలేదు. సినిమాపై ఒక రాయి వేసేస్తే మేం తోపులం అని ఫీల్ అవుతారు. మీ అంత మూర్ఖులు ఇంకెవరూ ఉండరని నేను అనుకుంటున్నా. ఆ విషయంలో ఈ ‘రాజుగారి గది 3’ సమాధానం చెప్పింది. ఈ సినిమా దర్శకుడు ఓంకార్, అశ్విన్‌లు వీటిని పెద్దగా పట్టించుకోకండి. ఈ సినిమాకే కాదు.. చాలా సినిమాలకు ఇలాగే అయ్యింది. వాళ్లల్లో నేనూ ఒక్కడినే అని నువ్ అనుకో అంతే. ఈ సినిమాకి కష్టపడ్డారు కాబట్టే ప్రేక్షకులు సక్సెస్ ఇచ్చారు” అంటూ రాజుగారి గది 3 సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారిపై అలీ ఫైర్ అయ్యారు.

Related posts