telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

భరోసా

అనేక వత్సరాలుగా ఒంటరితనమే లోకమై,
చిరు దరహాసమే మంజుల హాసమై,
మనోనిబ్బరమే ఆయుధమై,
ఎందరు ఉన్నా, లేకున్నా ,
తనదైన బంధాలు తోడు లేకున్నా,
తనకు తానే లోకమై ,
మరో ప్రపంచంలో విహరిస్తుండగా,
గోడకు పెట్టిన మేకును దిగగొట్టినట్లు,
ఇతరులు తమ గొప్ప పద ప్రయోగాల జాలంతో, హాస్యాస్పద భావ దూషణలతో,
నేర్పరితనంతో నాకు లేనిదానిని గుర్తు చేస్తుండగా, ఒంటరితనంలో ఉన్నా కొండంత
గుండె ధైర్యాన్ని తోడుగా చేసుకుంటూ,
అందమైన మనోఫలక మందిరాన్ని కాపాడుకుంటూ, భయంకరమైన నిశ్శబ్దంలో కూడా,
నా మువ్వల సవ్వడిని,
నా గుండె చప్పుడును కూడా ,
నా నేస్తాలుగా భావించి
నా కనుసన్నలలో ఉండమని సైగ చేస్తే ,
మురిసిపోతూ , అవి నీ వెంటే తోడున్నామని
భరోసానిస్తున్నాయి…
నాతో పాటే వస్తున్న నా నీడ,
నేను చేయ తలపెట్టిన పనికి పూర్తి సహకారం ఇచ్చే ప్రకృతి, ఇవి చాలవా! నన్ను ఏదో శక్తి ముందుకు నడిపిస్తుందని… పంచభూతాలైన ప్రకృతి దేవతలు నాకు తోడున్నారని…

Related posts