రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచదేశాలు జరుపుకోనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొట్టి మహిళ జ్యోతి.. ఇవాళ నాగపూర్‌లో యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి అమ్నే. యోగా డేకు ముందు ఆమె యోగా ప్రాక్టీస్ చేసింది.
మథుర ఎంపీ హేమా మాలిని కూడా యోగా డేపై స్పందించారు. యోగాను ఎవరు వద్దంటారు అని ఆమె అడిగారు. యోగా చాలా ముఖ్యమైందని, ప్రతి ఒక్కరూ యోగా చేయాలని, మానసిక, శారీరక ఫిట్‌నెస్‌ను పెంచుతుందని, చిన్నతనంలోనే ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని హేమా మాలిని అన్నారు. ప్రధాని మోదీ కూడా యోగాపై ఇవాళ కొన్ని వీడియోలు షేర్ చేశారు. యోగా ద్వారా ఆధ్యాత్మిక పరిపక్వతను ఎలా సాధించాలో ఆ వీడియోల్లో వివరించారు. యోగాలో ధ్యానం అత్యంత ముఖ్యమైన ప్రక్రియ అని ఓ ట్వీట్‌లో తెలిపారు. నది శోధన, అనులోమ విలోమ ప్రక్రియల గురించి వివరించారు.