telugu navyamedia
రాజకీయ వార్తలు

బెదిరింపులకు పాల్పడ్డ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్

అధికార పార్టీ నేతల కుమారులు ఇతర పార్టీ నేతలను బెదిరించడం ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. రాజకీయ అండదండలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ నేతపై బెదిరింపులకు పాల్పడిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిని మధ్యప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

బీజేపీ హర్దా ఎమ్మెల్యే కమల్‌ పటేల్‌ కుమారుడు సుదీప్‌ ఏప్రిల్‌ లో కాంగ్రెస్‌ నేత సుఖ్‌రామ్‌ బమ్నేపై బెదిరింపులకు దిగాడు. సుఖ్‌రామ్‌ బమ్నే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సుదీప్‌ను అరెస్ట్‌ చేశారు. సుదీప్‌ను కోర్టులో ప్రవేపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

Related posts