telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమీరా కుమార్తె పేరు, అర్థం ఇవే…!

Sameera-Reddy

తెలుగులో స్టార్ హీరోలతో నటించిన సమీరారెడ్డి పెళ్ళి తరువాత సినిమాలకు దూరమైనా, గర్భవతిగా ఉన్నప్పుడు ఫోటో షూట్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవలే సమీరా రెడ్డి రెండవ కాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. బిజినెస్‌మేన్ అక్షయ్ వర్ధిని 2014లో పెళ్లాడారు. వీరికి మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు. కాగా రెండోసారి సమీరా గర్భవతి అయిన తర్వాత సమీరా మాతృత్వంపై తన ఆలోచనలను, ప్రెగ్నెన్సీ ఫొటోలను పోస్ట్ చేశారు. కొన్ని రోజుల ముందు ఓ పాపకు జన్మనిచ్చారు. తాజాగా తన పాపకు “నైరా” అనే పేరుని పెట్టామని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఈ మేరకు “మా గారాల పట్టి నైరా వర్ధేకి కుటుంబంలోకి స్వాగతం” అంటూ మెసేజ్ కూడా పెట్టారు. అంతేకాదు నైరా అంటే సరస్వతీ దేవి పేరు అని.. హిబ్రూ భాషలో మొక్క అనే అర్థం వస్తుందని “నైరా” పేరుకు గల అర్థం కూడా తెలిపారు. నెటిజన్లు ఈ పేరు బాగుందని కామెంట్స్ చేస్తున్నారు.

Related posts