telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కౌశల్ ఆర్మీ ఎటాక్… వెనక్కి తగ్గిన రోల్ రైడా

Raadu-Song

తెలుగు ర్యాపర్ గా రోల్ రైడాకు మంచి గుర్తింపు ఉంది. అయితే బిగ్ బాస్-2 షోలో పాల్గొన్న తరువాత రోల్ రైడాకు మంచి గుర్తింపు లభించింది. అయితే ఆయన తాజాగా “రాదు” అనే ర్యాప్ సాంగ్ ను చేశారు. అయితే ఈ పాటలో ఎక్కువగా ట్రోల్ అయిన విషయాలను ఎంచుకున్నాడు రైడా. ఈ పాటలో ఓ చోట “ఆర్మీ పెట్టుకుంటే డాక్టరేట్ వస్తదా…” అనే లిరిక్ ఉంది. ఇది కౌశల్ ను ఉద్దేశించినట్టుగా ఉంది. ఇదే విషయాన్ని గమనించిన కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో ఈ వీడియోకు డిస్ లైకులు కొట్టడం మొదలుపెట్టారు. ఇది మరీ మితిమీరిపోతుందని గమనించిన రోల్ రిడా కౌశల్ ఆర్మీకి క్షమాపణ చెప్పుకొచ్చారు.

”నేను కంపోజ్ చేసిన రాదు అనే సాంగ్ కు భారీ వ్యూస్ తో పాటు డిస్ లైకులు కూడా వస్తున్నాయి. అందుకు కారణం ఏంటో నాకు తెలుసు. ఈ పాటలో నేను ట్రోల్ అయిన విషయాలన్నీ పెట్టుకున్నా… అందులో ‘ఆర్మీ పెట్టుకుంటే డాక్టరేట్ వస్తదా’ అని కూడా పెట్టాను. నిజానికి అది నేను కౌశల్ ను ఉద్దేశించి చేసిన పనికాదు.. కౌశల్ కి డాక్టరేట్, గిన్నిస్ రికార్డ్ ఇస్తామని కొందరు మోసం చేశారు. ఈ కౌంటర్ వాళ్ళకు మాత్రమే. మీరంతా నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నారు. దయచేసి క్షమించండి… కౌశల్ తో నాకు మంచి ర్యాపో ఉంది. ఆయన కారణంగా నాకొక అవార్డు కూడా వచ్చింది…” అంటూ క్షమాపణ చెప్పుకొచ్చాడు రోల్ రైడా. మరి ఇప్పటికైనా కౌశల్ ఆర్మీ శాంతిస్తుందేమో చూడాలి.

Related posts