telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆకాశవాణి” విలన్ రాజమౌళికి నచ్చలేదట…!

Akashavani

తాజాగా ఎస్ఎస్ రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ నిర్మిస్తున్న చిత్రం “ఆకాశ‌వాణి”. ఈ సినిమాతో రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ ఆగస్టులో సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని విలన్ కేరక్టర్‌పై ఓ ఆసక్తిక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కథ మొత్తం విలన్ చుట్టే నడుస్తోందట. ఈ పాత్రను కొత్త నటుడితో చేయించారు. అయితే ఈ పాత్రను తెరకెక్కించిన విధానం కార్తికేయ తండ్రి, దర్శకుడు రాజమౌళికి నచ్చలేడట. దీంతో ఈ పాత్రను మరో నటుడితో చేయించారట. కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేశారట. రాజమౌళి సినిమాలో విలన్‌ను ఎంత కీలకంగా చూపిస్తారో.. అదేవిధంగా ఈ “ఆకాశవాణి”లో కూడా చూపించారట. ఇందువల్ల ఈ సినిమా ఆగస్టులో కాకుండా సెప్టెంబర్‌లో విడుదలయ్యే అవకాశాలున్నాయని చిత్ర యూనిట్ అంటోంది.

Related posts