telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మన్మథుడు-2 : రొమాంటిక్ లిరికల్ వీడియో సాంగ్ “నాలోన…”

రాహుల్ రవీంద్రన్‌ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన‌ తాజా చిత్రం “మన్మథుడు-2”. ఈ చిత్రంలో నాగ్‌ సరసన రకుల్ ప్రీత్‌ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఇప్ప‌టికే విడుద‌లైన‌ టీజ‌ర్‌లు సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ సినిమాలో హీరోయిన్లు స‌మంత‌, కీర్తి సురేష్ ప్ర‌త్యేక పాత్ర‌ల్లో న‌టించారు. ల‌క్ష్మి, రావు ర‌మేష్‌, వెన్నెల కిషోర్‌, ఝాన్సీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించనున్నారు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైల‌ర్‌ కు మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైల‌ర్‌లో కూడా లిప్‌లాక్ స‌న్నివేశాల‌ను చూపించారు. అయితే పేరుతో త‌ప్ప గ‌తంలో వ‌చ్చిన “మ‌న్మ‌థుడు”కు ఈ సినిమాకు ఎలాంటి సంబంధ‌మూ లేద‌ని తాజాగా జ‌రిగిన “మ‌న్మ‌థుడు-2” ట్రైల‌ర్ లాంఛ్ కార్య‌క్ర‌మంలో నాగార్జున చెప్పారు. అంతేకాదు ఇది ఒక ఫ్రెంచ్ సినిమాకు రీమేక్‌. ఆ సినిమా హ‌క్కులు తీసుకుని ఈ సినిమాను రూపొందించామ‌ని నాగార్జున తెలిపారు. తాజాగా ఈ చిత్రం నుంచి “నాలోన…” అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు. ఈ రొమాంటిక్ సాంగ్ మనసుకు ఆహ్లాదంగా అన్పించడమే కాకుండా… యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ సాంగ్ ను వీక్షించండి.

Related posts