telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

35 ఏళ్ళపాటు పైలెట్ గా… రిటైర్ అయ్యే రోజు విమానంలో ఇలాంటి పని…!?

Pilot

మాడ్రిడ్ నుంచి మియామి వెళ్లడానికి సిద్ధంగా ఉందా విమానం. ఆ విమానం నడుపుతున్న పైలట్ జో వేస్‌ ఆరోజే రిటైర్ కాబోతున్నారు. 35ఏళ్లపాటు పైలట్‌గా పనిచేసిన ఆయన కెరీర్ ఆ ప్రయాణంతో ముగియబోతోంది. అందుకే జో భార్య కూడా ఆరోజు విమానంలో ఉంది. ఆమె పక్కనే సారా అనే మహిళ తన రెండేళ్ల కుమారుడు కీ క్లిటెనిక్‌తో కలిసి కూర్చొంది. డౌన్ సిండ్రోమ్ అనే మానసిక వ్యాధితో కీ బాధపడుతున్నాడు. అతన్ని చూసి ముచ్చటపడిన జో భార్య.. కాక్‌పిట్‌లో ఉన్న తన భర్తకు ఓ మెసేజ్ పంపింది. ఒకసారి వచ్చి కీని కలవాలని కోరింది. దాంతో అక్కడకు వచ్చిన జో.. కీని కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లి మొత్తం చూపించాడు. అనంతరం తన వ్యక్తిగత వింగ్స్ బ్యాడ్జ్‌ను తీసి కీ చొక్కాకు తగిలించాడు. దీంతో ఎంతో సంతోషించిన కీ.. సైన్ లాంగ్వేజ్(మూగవాళ్లు మాట్లాడటానికి వాడే సంజ్ఞల భాష)లో జోకు ధన్యవాదాలు తెలిపాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటన గురించి సారా మాట్లాడుతూ.. ‘కీ సంతోషానికి అవధుల్లేవు, తన కొత్త మిత్రుడంటూ జో గురించి మాట్లాడుతూనే ఉన్నాడు’ అని చెప్పారు.

Related posts