యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) సైతం పాన్ ఇండియా చిత్రంగానే ముస్తాబవుతోంది. అయితే ఇప్పుడు డార్లింగ్‌కి ఉన్న ఈ పాన్ ఇండియా ఇమేజ్‌ను పాన్ యూనివర్సల్ ఇమేజ్‌గా మార్చేందుకు సిద్ధమవుతున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ 50 వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న సందర్భంగా ప్రభాస్, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కలయికలో ఓ సినిమా నిర్మించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటిస్తున్న 21వ సినిమా ఇది. ఓ విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని, గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యముందని వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఈ సినిమా విఎఫ్‌ఎక్స్ పనుల కోసమే దాదాపు రూ.50 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు సమాచారం.
previous post
సౌత్‌లో హీరోలను చూడటానికే థియేటర్స్‌కు వస్తారు : రకుల్ ప్రీత్ సింగ్