telugu navyamedia
సినిమా వార్తలు

బీచ్ లో సేద తీరుతున్న విరుష్క జంట

Anushka

బాలీవుడ్ స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంటకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ రెండేళ్ల కిందట పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. వీరిద్దరినీ కలిపి అభిమానులు “విరుష్క” అని ముద్దుగా పిలుచుకుంటారు. అనుష్క శర్మ ఇటీవల కాలంలో సినిమాలను బాగా తగ్గించింది. షారూక్ ఖాన్‌తో నటించిన “జీరో” తర్వాత ఇప్పటివరకు అనుష్క మరో సినిమాకు ఓకే చెప్పలేదు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో వివాహానికి ముందు తన గ్లామరస్ ఫోటోలను, బికినీ ఫోటోలను రెగ్యులర్‌గా సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసేది. పెళ్ళి తరువాత కూడా అందాలను ఆరబోస్తోంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉన్న వీరిద్దరూ తమ ఫోటోలను ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా తన భార్య అనుష్క శర్మతో కలిసి బీచ్‌లో దిగిన ఫోటోను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. కుర్చీలో కూర్చున్న అనుష్క ఒడిలో సేదతీరుతూ తీసుకున్న సెల్ఫీని కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోకు కేవలం మూడు గంటల్లోనే ఇరవై లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ ఫోటోపై స్పందించారు.

Related posts