telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-4 : మోనాల్ ను నామినేట్ చేసిన అభి… అఖిల్ ఫైర్

Bigg-Boss-4

బిగ్ బాస్-4లో ఈరోజు జరగనున్న నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా ఉంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా… అందులో కంటెస్టెంట్స్ సుత్తి తీసుకుని తమకు ఇష్టం లేని వ్యక్తి ఫొటోని ముక్కలు ముక్కలు చేస్తున్నారు. గత వారం మెహబూబ్‌ని సేవ్ చేసి సెల్ఫ్ నామినేట్ అయిన అరియానాను వరుసగా రెండో సారి నామినేట్ చేస్తున్నాడు మెహబూబ్. ఈ నామినేషన్‌లో మన మధ్య ఉన్నవి క్లియర్ అవ్వాలని కోరుకుంటున్నా అంటూ మెహబూబ్ కుంటి సాకులు చెప్పడంతో… క్లియర్ అవ్వాలని చెప్పి నామినేట్ చేసి డైరెక్ట్‌గా బయటకు పంపించేస్తున్నావ్ ప్రతిసారీ అంటూ ఫైర్ అవుతోంది అరియానా. ఇక యాంకర్ లాస్య-అవినాష్ మధ్య రచ్చ రేగింది. మరోవైపు హారిక ‘మీరు చెప్పినట్టు సరిగా ఆడలేదంటే ఒప్పుకోను’ అంటూ మెహబూబ్‌ని నామినేట్ చేస్తూ అతని ఫొటోని సుత్తితో బాదేస్తోంది. అఖిల్ మరోసారి మోనాల్ విషయంలో తెగ ఫైర్ అయ్యాడు. ‘మోనాల్ మాట్లాడకపోతే అది తన ఇష్టం.. నేను ఎప్పుడూ మాట్లాడొద్దని చెప్పలేదు.. ఎప్పుడైనా నేను నీకు చెప్పానా అభితో మాట్లాడొద్దని ?’ అంటూ మోనాల్‌ ను అడుగుతున్నాడు అఖిల్. నేను హర్ట్ అయ్యా.. బయట మా అమ్మా నాన్నా హర్ట్ అయ్యారు అని అఖిల్ తెగ ఫీల్ అయిపోవడంతో.. అమ్మా రాజశేఖర్ ‘ఎవరికి అమ్మా నాన్నా లేరు’ అంటూ సీరియస్ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య గట్టిగానే రచ్చ జరిగింది. ఇక అభి అయితే.. మోనాల్‌ని నామినేట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు. దట్ ఈజ్ బిగ్గర్ క్రైమ్..ఇది ఎనిమిదో వారం ఇప్పుడు నిన్ను నామినేట్ చేస్తున్నా.. అని అభిజిత్ మోనాల్‌ని నామినేట్ చేస్తూ కనిపించాడు. చివరగా మోనాల్ గజ్జర్ ఏడుస్తూ ‘ఎవరికైనా ఏ విధమైన డౌట్స్ ఉన్నా.. నా దగ్గరకు రండి.. నన్ను అడగండి దయచేసి’ అంటూ దండం పెడుతోంది. దీంతో మొత్తానికైతే అఖిల్, మోనాల్, అరియానా, మెహబూబ్, లాస్య, అమ్మా రాజశేఖర్‌‌లు నామినేట్ అయినట్టుగా తెలుస్తోంది.

Related posts