telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల్లు అర్జున్ క్యారవాన్ లుక్ చూశారా…!!?

Carvan

అల్లు అర్జున్ తన డాన్స్ విషయంలోనే కాదు స్టైల్ విషయంలోనూ ఎంతో కేర్ తీసుకుంటాడు. అందుకే అభిమానులు ఆయనను స్టైలిష్ స్టార్ అని పిలుచుకుంటారు. తాజాగా తన క్యారవాన్ కూడా చాలా స్టైలిష్‌గా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అందుకోసం అత‌ని కార్ వ్యాన్‌ని ముంబైకి చెందిన వ్య‌క్తికితో ప్ర‌త్యేకంగా త‌యారు చేయించుకున్నాడ‌ట బ‌న్నీ. మూడు కోట్లు పెట్టి ఇంటీరియ‌ర్ డెక‌రేష‌న్ చేయించుకోగా, ఈ కార్ వ్యాన్ ధ‌ర రూ. 7 కోట్ల పై మాటే అంటున్నారు. ఇంత ల‌గ్జ‌రీ కార్ వ్యాన్‌ని దేశంలో ఏ హీరో కూడా వాడ‌డం లేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ కార్ వ్యాన్ ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంద‌ట‌. “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” త‌ర్వాత బ‌న్నీ త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 19వ చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ప్ర‌స్తుతం రెండో షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. చిత్రం ప్ర‌ధాన పాత్ర‌ధారులు అంద‌రు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ట‌బు, స‌త్య‌రాజ్‌, సుశాంత్‌, నివేదా పేతురాజ్ కీలక పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Related posts