telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ప్రకాశం బ్యారేజ్ కు 7 లక్షల క్యూసెక్కులకు పైగా వస్తున్న ఇన్ ప్లో…

కృష్ణానదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రలో అలాగే ఎగువన కురిసిన వర్షాలతో భారీగా వరద నీరు విజయవాడ చేరుకుంటుంది. ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో కృష్ణానీటిని సముద్రంలోకి వదిలిపెడుతున్నారు. ప్రకాశం బ్యారేజీకి 8 లక్షల వరకు ఇన్ ఫ్లో వస్తుంటే వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలిపెడుతున్నారు. అయితే విజయవాడ ప్రకాశం బ్యారేజీకి గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ప్లో 7 లక్షల 67 వేల క్యూసెక్కులు, ఔట్ ప్లో 7 లక్షల 64 వేలుగా ఉంది. అయితే ఇప్పటికే కృష్ణా ఈస్ట్రన్ అండ్ వెస్ట్రన్ కాల్వలకు సాగునీటి అవసరాలకు 3 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. అయితే ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద నీటిని సముద్రంలోకి వదలడంతో కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు. కరకట్ట దగ్గర గంటగంటకు ప్రవాహం రెట్టింపవుతోంది.

Related posts