telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

డ్రై రన్ ఏర్పాట్ల పై కేంద్ర మంత్రి సమీక్ష…

corona vacccine covid-19

కరోనా వైరస్ ని నివారించేందుకు  భారత దేశ వ్యాప్తంగా రేపు వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించనున్నారు. డ్రై రన్ ఏర్పాట్లు, లోటుపాట్ల పై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డ్రై రన్ నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్ల అలాగే సాఫ్ట్వేర్ పని చేస్తున్న తీరు, వ్యాక్సిన్ ను నిల్వ చేయడానికి అవసరమైన కోల్డ్ స్టోరేజ్, రవాణా చేయడానికి అవసరమైన కోల్డ్ చైన్, బెనిఫిషియరీ ఎన్రోల్మెంట్ పై ఈ కాన్ఫరెన్స్ లో సుదీర్ఘ చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సాఫ్ట్వేర్ సమస్యలు ఉన్నట్లుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల తెలిపారు. 14 జిల్లాల్లో వాక్సిన్ లబ్ధిదారులను ఎన్రోల్ చేయడానికి సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయం పై స్పందించిన కేంద్ర మంత్రి ఈరోజు సాయంత్రం లోపు దీనికి పరిష్కారం చూపిస్తామని  హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోనే వ్యాక్సిన్ తయారు అవుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఎక్కువ డోసుల వ్యాక్సిన్ అందజేయాలని మరోమారు కేంద్ర మంత్రిని ఈటల కోరారు.

Related posts