telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్ …రేపటి నుంచి వీక్లీ ఆఫ్ విధానం

Ap police

ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వేలాది మంది పోలీసు ఉద్యోగులు ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారాంతపు సెలవును ప్రభుత్వం రేపటి నుంచి అమలు చేయనుంది. ఇక పోలీసులకు కూడా ప్రతివారం ఓ సెలవు దినం ఉంటుంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు పోలీసు విభాగం కొత్తగా వీక్లీ ఆఫ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఈ మేరకు ఏపీ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ ఉత్తర్వులు జారీచేశారు.

కానిస్టేబుల్ నుంచి సీఐ ర్యాంకు అధికారుల వరకు వారాంతపు సెలవులు అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే విశాఖ, కడప జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వీక్లీ ఆఫ్ విధానాన్ని ప్రవేశపెట్టామని, ఇకమీదట ప్రతినెలా వారాంతపు సెలవులపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని అయ్యన్నార్ వెల్లడించారు. పని ఒత్తిడితో పోలీసులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, వారాంతపు సెలవుతో పోలీసులకు ఉపశమనం లభిస్తుందని అన్నారు.

Related posts