లేడీ సూపర్ స్టార్ నయనతార అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ఇటు గ్లామర్ రోల్స్ తో దూసుకెళ్తోంది. ఆమె సినిమాల్లో హీరో నామమాత్రమే. అసలైన హీరో ఆమె. ఆమె పేరుతోనే కోట్లు వచ్చి పడుతుంటాయి. మరోవైపు భారీ బడ్జెట్ సినిమాల్లోనూ నటిస్తూ భారీ క్రేజ్ ను మూటగట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ఇటు తెలుగు, అటు తమిళంలో బిజీగా ఉన్న ఆర్టిస్టులలో ఒకరు. ప్రస్తుతం స్టార్ హీరో సినిమాలలో నటిస్తూనే మరోవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. అయితే ఈ మధ్య ఎందుకో పూర్తిగా ట్రాక్ తప్పుతోంది. గత ఏడాది ఆరంభంలో వచ్చిన ‘విశ్వాసం’ తరువాత నయనతారకి విజయాలే కరువయ్యాయి. ‘ఐరా’, ‘కొలైయుదిర్ కాలమ్’ వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్, ‘మిస్టర్ లోకల్’ వంటి మీడియం రేంజ్ హీరో కాంబినేషన్ సినిమా… ఇలా అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో కథ తన పాత్ర చుట్టూ తిరిగినా… ఆ క్యారెక్టర్స్ లో విషయం లేకపోవడంతో… డిజాస్టర్స్ తప్పలేదు. ఇక ‘మిస్టర్ లోకల్’ వంటి పక్కా మాస్ మూవీతోనూ నయన్ కి సేమ్ సిట్యూయేషన్. ఇక మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటించిన ‘సైరా’, ఇళయ దళపతి విజయ్ సరసన ఆడిపాడిన ‘విజిల్’, సూపర్ స్టార్ రజనీకాంత్ కి జంటగా మెరిసిన ‘దర్బార్’… ఇలా మూడు సినిమాల్లోనూ నయనతార… ఏ మాత్రం మురిపించలేకపోయింది. పైగా తన స్థాయికి తగ్గ పాత్రలు కాకపోవడంతో విమర్శల పాలైంది. మరి రాబోయే సినిమాల విషయంలోనైనా నయన్ తగిన జాగ్రత్తలు తీసుకుంటుందేమో చూడాలి.
previous post
next post