telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆర్ఆర్ఆర్”లో మరో హీరోయిన్ ?

Shriya

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లలో “ఆర్ఆర్ఆర్” అనే భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తైంద‌ని ఇటీవ‌ల మేక‌ర్స్ తెలిపారు. అయితే చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా అలియా భ‌ట్‌, ఎన్టీఆర్‌కి జోడీగా ఓలివియా మోరిస్‌ ‌నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చితాన్ని వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. భారీ బ‌డ్జెట్‌తో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. చిత్రానికి సంబంధించి ఇప్ప‌టి వ‌రకు ఒక్క లుక్ కూడా విడుద‌ల కాక‌పోవ‌డంతో సినిమాకి సంబంధించిన అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా గ‌మనిస్తున్నారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో శ్రియ కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఆమెకు రెండో చిత్రమిది. ఇంతకు ముందు ‘ఛత్రపతి’లో ప్రభాస్‌కు జంటగా నటించిన సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో హిందీ హీరో అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు జోడీగా శ్రియ కనిపించనున్నారు. హిందీ ‘దృశ్యం’లో వీరిద్దరూ జంటగా నటించారు. మళ్లీ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం వికారాబాద్‌ అడవుల్లో అజయ్‌ దేవగణ్‌, శ్రియపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని తెలిసింది.

Related posts