telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ప్లాప్ ఇచ్చిన దర్శకునితో విజయ్ మళ్ళీ సినిమా..?

Vijay

తమిళ్ తో పటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న హిరి విజయ్ దళపతి. అయితే విజయ్ చేసిన కొత్త సినిమా మాస్టర్. ఈ సినిమాపై అభిమానులు పెట్టుకున్న అంచనాలు తారుమారయ్యాయి. అనుకున్నంత స్థాయిలో సినిమా రాణించలేక పోయినా పర్వాలేదు అనే టాక్ అందుకుంది. సినిమాకి పర్వాలేదు అన్న టాక్ వచ్చినా, కేవలం మూడు రోజుల్లో భారత్‌లో వంద కోట్లు మార్క్‌ను దాటింది. ఈ సినిమాకు లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విజయ్ సేతుపతి కూడా ప్రధాన పాత్రలలో కినిపించారు. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం మాస్టర్ కాంబో మళ్లీ రానుందంట. ఈ సినిమాకు చేసిన కాంబోలోనే మరో సినిమా తెరకెక్కనుందంటున్నారు. విజయ్, లోకేష్‌తో 7స్టూడియోస్ వారు మరో తాజా చిత్రాన్ని నిర్మించనున్నారంట. ఈ వార్త నిజమేనని విజయ్ కూడా తెలిపారు. అంతేకాకుండా ఈ సారి 50-50 ఉండదంటూ ట్వీట్ చేశారు. ఈ వార్త విన్న విజయ్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే ఈ సినిమాకు పేరును ఇంకా ఖరారు చేయలేదు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.

Related posts