telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సాంకేతిక

రెట్టించిన ఉత్సాహంతో .. గగన్‌యాన్ కు సిద్దమవుతున్న .. ఇస్రో

isro preparing for gaganyan project

ప్రతి ఓటమి మరో గొప్పవిజయానికి పునాది అన్నది అక్షర సత్యం. ఇస్రో తాజా అపజయంతో నిరుత్సాహపడకుండా రెట్టించిన ఉత్సాహంతో తదుపరి అడుగు వేయడానికి సిద్ధం అవుతున్నారు. భారత్ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గగన్‌యాన్ కోసం వ్యామగాము(ఆస్ట్రోనాట్స్)ల ఎంపిక ప్రక్రియలో మొదటి దశ పూర్తయింది. బెంగళూరులోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్‌ఏరోస్పేస్ మెడిసిన్‌లో ఆస్ట్రోనాట్‌ల కోసం మొదటి దశ ఎంపిక పరీక్షలు కొనసాగినట్లు భారతీయ వాయుసేన(ఐఏఎఫ్) వెల్లడించింది. గగన్ యాన్ కోసం భారత వాయుసేన పైలెట్లను ఇస్రో ఎంపిక చేయగా.. ఆ పైలట్లకు శారీరక పరీక్షలు నిర్వహించినట్లు ఐఏఎఫ్ తెలిపింది. మొదటిసారి మనుషులను అంతరిక్షంలోకి పంపుతుండటంతో శిక్షణ అనుభవం ఉన్న పైలెట్లే సరైనవారని ఇస్రో భావించింది.

ఈ క్రమంలో ఎంపిక చేసిన పైలెట్లకు ల్యాబ్ పరీక్షలు నిర్వహించారు. రేడియాలాజికల్, క్లినికల్ పరీక్షలు చేశారు. ఎంపిక ప్రక్రియలో కాబోయే వ్యోమగాముల సైకాలజీని కూడా పరీక్షించారు. మానవులను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో భారత్ 2022లో గగన్‌యాన్ ప్రాజెక్టును చేపడుతోంది. అనుకున్న సమయానికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు ఇస్రో ఛైర్మన్ కే శివన్ తెలిపారు. ఇండియన్ ఏయిరో స్పేస్ మెడిసిన్(ఐఏఎం)లో పైలెట్లకు కఠినమైన శారీరక పరీక్షలు జరిపామని ఐఏఎఫ్ తెలిపింది. మొదటగా 12మందిని ఎంపిక చేసి.. ఆ తర్వాత వారిలో నలుగురిని తుది శిక్షణ కోసం నవంబర్ తర్వాత రష్యాకు పంపనున్నారు. ఆ నలుగురిలో ముగ్గురు మాత్రం గగన్ యాన్ మిషన్ ద్వారా నింగిలోకి ఎగరనున్నారు.

Related posts