telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అంతా బూటకమే .. ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న .. అమెరికా..

fake natural calamity video viral in america

వ్యాపారంలో కూడా నీతినియమాలు ఉంటాయి, తాము భారతికితే చాలు, మిగిలినవాళ్లు ఏమైనా పరవాలేదు అనుకునే దేశాలలో అమెరికా ఒకటి. అందుకే యుద్ధాలకు పురిగొలిపి, ఆయుధాలు అమ్ముకొని, ధనాగారం నింపుకుంది, నింపుకుంటూనే ఉంది కూడా. అందుకే ప్రకృతి ప్రకోపించింది… ప్రకృతి వైపరీత్యాలు అమెరికన్లు బెంబేలెత్తిపోతున్నారు. ఈ చిత్రంలో కనిపించే తుఫాను తాము ఎప్పుడూ చూడలేదు అని ఇది అసలు నిజమా లేదంటే ఈ ఫోటోని ఎవరైనా మార్ఫింగ్ చేశారా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నించుకుంటున్నారు. ఈ చిత్రం గనక మనం చూస్తే ఎంతో విశాలమైన మబ్బు ఒక తుఫానుగా మారి ఫ్లోరిడా సిటీ మీదకు వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది కానీ ఇంత పెద్ద తుఫాను కేవలం సినిమాల్లోనే ఇటువంటిది బయట నిజంగా వచ్చే అవకాశం లేదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారట. కానీ ఇందులో ఎటువంటి మార్ఫింగ్ జరగలేదు అని ఇది నిజంగానే తీసిన చిత్రం అని మరొక పక్క సోషల్ మీడియాలో నెటిజన్లు ఇస్తుండటంతో ఏది నిజమో అర్థం కాక ఫ్లోరిడా వాసులు తలపట్టుకుని భయంతో వణికిపోతున్నారు అట.

ఫోటోలు ఎవరూ నమ్మకపోవడంతో, ఏకంగా ఒకరు వీడియోని తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారట అది చూసి ఎంతో మంది భయాందోళనకు గురి అయ్యారు. కొన్ని వేల సంఖ్యలో షేర్లు చేయడంతో అందరికీ కొద్ది సమయంలోనే విషయం తెలిసింది. అసలు ఇంత విశాలమైన తుఫాన్ వస్తే మొత్తం ఫ్లోరిడా నగరమే ఎగిరిపోతుంది అని ఇక తాముచేసేది ఏదీ లేదు అని చేతులెత్తేసిన మరి దేవుడిని ప్రార్థించడం మొదలు పెట్టారంట ఫ్లోరిడా వాసులు. ఈ భయాందోళనలు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో, దీనిమీద వాకబు మొదలుపెట్టారట పోలీసులు. దాంతో ఇది ఇప్పటి చిత్రం కాదు అని 2016లో బహామాస్ లో వచ్చిన తుఫాను యొక్క చిత్రమని అది కూడా నిజమైన చిత్రం కాదు అని గ్రాఫిక్స్ను బాగా జోడించి దీనిని వైరల్ చేశారు అని చెప్పిన తర్వాత అందరూ ఊపిరిపీల్చుకున్నారు అట.

Related posts