మేషం : కుటుంబసభ్యులతో అకారణ వైరం. బంధువుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో కొంత నిరాశ. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన.
వృషభం : కుటుంబంలో ఒత్తిడులు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు.
మిథునం : సన్నిహితుల సాయం అందుతుంది. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.
కర్కాటకం : పడిన శ్రమ ఫలితమిస్తుంది. కొత్త పరిచయాలు. అదనపు రాబడి ఉంటుంది. చిరకాల మిత్రులను కలుస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. విందువినోదాలు.
సింహం : పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరాశ.
కన్య : ముఖ్యమైన పనులు వాయిదా. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగవు. ధనవ్యయం.
తుల : వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తా శ్రవణం. వాహనాలు కొంటారు. సంఘంలో గౌరవం. నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు పొందుతారు.
వృశ్చికం : కొత్తగా అప్పులు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు. దైవదర్శనాలు.
ధనుస్సు : కొత్త పనులు చేపడతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.
మకరం : ఉద్యోగ బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో ప్రతిబంధకాలు. ఆధ్యాత్మిక చింతన.
కుంభం : సంఘంలో గౌరవమర్యాదలు. ఆకస్మిక ధనలాభం. ఆస్తి వివాదాల పరిష్కారం. గృహ, వాహనయోగాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత ప్రగతి ఉంటుంది. విందువినోదాలు.
మీనం : పలుకుబడి పెరుగుతుంది. ఆలయాల దర్శనాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి.