రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో “ఆర్ఆర్ఆర్” అనే సినిమాని చేస్తున్నాడు. దాదాపుగా 80 శాతం షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వలన వాయిదా పడి మళ్ళీ పట్టాలేక్కింది. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ కూడా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా, విజయేంద్రప్రసాద్ కథని అందించారు. ఇక ఈ నెల 22న ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ రోజు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ , కీరవాణి, సెంథిల్ కుమార్‌తో పాటు చిత్ర బృందం రాజమౌళి పైన సరదాగా ఫిర్యాదులు చేశారు. రాజమౌళి పైన వచ్చిన ఫిర్యాదుల పైన మీరు కూడా ఓ లుక్కేయండి. ఇక అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళికి పేరుంది. అయన ఒక్కో సినిమాని ఓ శిల్పంలాగా చెక్కుతారు అందుకే ఆయనను జక్కన్న అని కూడా పిలుచుకుంటారు. ఒక్కో సినిమాకి ఎన్నో సంవత్సరాలు కేటాయిస్తారు. ఈరోజు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
previous post