telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఉత్తర తెలంగాణలో ఆగిన కారు.. వికసించిన కమలం !

congress bjp trs

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో  88  అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 9 సీట్లని మాత్రమే గెలుచుకుంది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ముందు వ్యూహాత్మకాంగా ముందుకు వెళ్లారు. కాగ్రేస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని 16 ఎంపీ సీట్లు గెలుపొందాలని ముమ్మర ప్రచారం నిర్వహించారు. ప్రాంతీయ పార్టీలే రేపు కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పారు. దానికి అనుగుణంగానే  జాతీయ స్థాయిలో  నేతలని కలసి చేసిన హడావిడి  చేశారు. ఎంతో కసరత్తు చేసి అభ్యర్థులను ఎంపిక చేసి, పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలబెట్టడంలో సఫలీకృతం అయ్యారు. ఈ ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ ని ముందుకు తీసుకురావడం, ప్రాంతీయ పార్టీలదే  కేంద్రంలో అధికారమని ప్రచారం నిర్వహించారు.  

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాలుగు నెళ్లలోనే ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావడంతో టీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోవడం లేదు. ఈ ప్రభావం మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా పడే అవకాశముందని కొందరు నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వంలో  కేవలం కేసీఆర్, కేటీఆర్ తప్ప వేరెవ్వరూ పెద్దగా కనపడరు. ఇ సీనియర్లని పక్కన పెట్టడం, మరెవరికి వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం. హరీష్ రావు లాంటి ముఖ్య నేతలను  కేవలం సిద్దిపేటకు పరిమితం చేయడం లాంటి అంశాలను ప్రజలు వ్యాతిరేకించినట్టు తెలుస్తోంది. 

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ కొన్ని చేయలేకపోయిన పనులు చేస్తారని భావించారు. కానీ కేసీఆర్ మాత్రం 16 సీట్లు ఎలా సాధించాలనే పనిలోనే నిమగ్నమయ్యారు.  ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలు అయిన నోటిఫికేషన్ లు, ఉద్యోగుల సమస్యలపై ఏ విధమైన ప్రగతి ప్రభుత్వ పనితీరులో కనబడకపోవడంతో వారు సైతం వ్యతిరేకత మొదలైంది.  ఇటీవలి  ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టీఆరెస్  బలపర్చిన అభ్యర్థుల ఓటమి పాలయ్యారు. 

నిజామాబాద్ పార్లమెంట్ లో రైతులు సైతం 178 మంది నామినేషన్లు వేయడం ఆ స్థానంలో కేసీఆర్ కూతురు సిట్టింగ్ ఎంపీ అయిన కవిత ఓడిపోవడం అది కూడా ఉత్తర తెలంగాణాలో ఈ ఘటన చోటు చేసుకోవడం టీఆరెస్ కు పెద్ద షాక్ గానే చెప్పవచ్చు. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో టీఆరెస్ గెలిచినప్పటికీ కూడా కేవలం ఈ నాలుగు నెలల్లోనే ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఏర్పడింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎందరో అధికార టీఆరెస్ లోకి  వెళ్ళినప్పటికీ ఈ ఎన్నికల్లో మూడు ఎంపీ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే స్థానంతో సరిపెట్టుకున్న బేజీపీ అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లను తమ ఖాతాలో వేసుకుంది. 

Related posts