telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ పదవీకాలం విజయవంతం కావాలి: స్టాలిన్

pujas performed for stalin for cm

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో భారీ మెజారిటీ సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు డీఎంకే అధినేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని వైసీపీ అద్భుతమైన విజయాన్ని సాధించిందని ప్రశంసించారు.

జగన్ ముఖ్యమంత్రిగా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. నా స్నేహితుడు, ఏపీకి కాబోతున్న ముఖ్యమంత్రి జగన్ కు శుభాకాంక్షలు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘనా విజయం సాధించారు. ఆయన పదవీకాలం విజయవంతం కావాలనీ, ఏపీతో పాటు దక్షిణాదిలో కూడా సరికొత్త ప్రణాళికలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా అని స్టాలిన్ ట్విటర్ లో పేర్కొన్నారు.

Related posts