telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చోడవరం నుంచే జగన్ పతనం ప్రారంభమైంది ..టీడీపీని భూస్థాపితం చేయడం నీవల్ల కాదు

జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని టీడీపీ ఛీప్ చంద్ర‌బాబు నాయుడు అన్నారు. విశాఖ జిల్లా చోడవరంలో బుధవారం జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ఐటీ రంగంలో యువతకు చాలా ఉద్యోగాలు వచ్చాయి. జగన్ సర్కార్ హయాంలో వాలంటీర్ ఉద్యోగాలు వచ్చాయి. 5 వేల రూపాయలకు ఎవరైనా ఉద్యోగం చేస్తారా?. జగన్ పదే పదే ఉద్యోగాలిచ్చామని చెబుతున్నారు. 

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై ప్రతిరోజూ కేసులేననంటూ దుయ్యబట్టారు. ఏం పీక్కుంటారో పీక్కోండి నేను చూస్తానంటూ జగన్ హెచ్చరించారని చంద్రబాబు గుర్తుచేశారు.

ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారు. కేసులకు భయపడే పార్టీ కాదు టీడీపీ అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీని ముందుకు తీసుకెళ్లాలన్నారు.

జగన్ రాజకీయాల్లో ఒక బచ్చా అని, టీడీపీని భూస్థాపితం చేయడం నీవల్ల కాదని చంద్రబాబు ఫైర్ అయ్యారు. టీడీపీ పనైపోయిందని చాలా మంది కలలు కన్నారని.. కానీ కలలు కన్న వాళ్ల పనే అయిపోయిందని చంద్రబాబు గుర్తుచేశారు. 

జగన్ మోహన్ రెడ్డి మమ్మల్ని బెదిరిస్తారా.. చోడవరం నుంచే జగన్ పతనం ప్రారంభమైందని ఆయన జోస్యం చెప్పారు.

ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా?. కోనసీమ రైతులు క్రాప్ హాలిడే దిశగా వెళ్తున్నారు?. సీఎం సొంత జిల్లా కడపలోనూ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. దీన్ని బట్టి వైసీపీ పాలన ఎలా ఉందో అర్ధమవుతుంది.’’ అని చంద్రబాబు అన్నారు. అమ్మఒడి ఏమైందని ప్రశ్నించారు. టీచర్ల వ్యవస్థను సర్వ నాశనం చేశారని విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ విశిష్టత గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీదా వుందన్నారు. వైసీపీని ఇంటికి పంపించే సత్తా ఉత్తారాంధ్రకు ఉందని చంద్ర‌బాబు అన్నారు

Related posts