telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

అస్వస్థతకు లోనైన భక్తులు తిరుమలకు రావొద్దు: టీటీడీ

tirumala temple

తిరుమలలో ఈ రోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనిమూడు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి సుమారుగా 4 గంటల సమయం పట్టవచ్చు. రేపటి నుండి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని గదులలో వేచి ఉండేందుకు అవకాశం లేదు. టైమ్ స్లాట్ ప్రకారం భక్తులను టైమ్ కి క్యూలో నేరుగా స్వామిదర్శనానికి అనుమతిస్తారు.

అస్వస్థతకు లోనైన భక్తులు తిరుమలకి రావొద్దని టీటీడీ అధికారులుసూచనలు జారీచేశారు. రేపు దివ్యాంగులు, వయోవృద్దులకు ప్రత్యేక దర్శనం కలదు. 18న ఐదేళ్లలోపు వయసున్న చిన్నపిల్లల తల్లితండ్రులకు ప్రత్యేక దర్శనం కలదు. రూ.10,000/- విరాళం ఇచ్చే భక్తులకు.. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన సౌకర్యం కలదు. నిన్న 63,747 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం లభించింది.

Related posts