telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు విద్యా వార్తలు

అమరావతి : .. గ్రామ, వార్డు సచివాలయ .. ఫలితాలు విడుదల.. 2 నుండి విధులలోకి..

village and ward secretariat results out

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్ష ఫలితాలను ఎపి ముఖ్యమంత్రి జగన్‌ విడుదల చేశారు. అనంతరం సిఎం జగన్‌ మాట్లాడుతూ.. పరీక్షలు విజయవంతంగా నిర్వహించి ఫలితాలను విడుదల చేసిన అధికారులను అభినందించారు. అధికారులు రికార్డు సమయంలో ఈ యజ్ఞాన్ని పూర్తిచేశారని కితాబిచ్చారు. ఏకకాలంలో ఇన్ని ఉద్యోగాలు కల్పించడం అన్నది ఓ రికార్డని జగన్‌ చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని తాము నిలబెట్టుకున్నామన్నారు. ఒకే నోటిషికేషన్‌ ద్వారా 1,26,728 శాశ్వత ఉద్యోగాలను కల్పించడం చరిత్రలో తొలిసారని వ్యాఖ్యానించారు. పరీక్షల్లో విజయం సాధించిన వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్లు జగన్‌ తెలిపారు. అభ్యర్థులకు తాము మంచి శిక్షణ అందజేస్తామనీ, శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ప్రజాసేవలో మమేకం కావాలని సూచించారు.

గ్రామ సచివాలయాల ద్వారా పరిపాలనలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయన్నారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకే చేరుస్తామని సిఎం జగన్‌ పేర్కొన్నారు. మొత్తం 19,50,582 మంది పరీక్ష రాయగా బీసీలు 10,04,087, ఓసీలు 3,95,918, ఎస్సీలు 4,52,288, ఎస్టీలు 98289 మంది ఉన్నారు. వీరిలో 1,98,164 (10.15 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. కేటగిరీల వారిగా చూస్తే ఓసీలు – 6.20 శాతం (24,583); బీసీలు – 10 శాతం (1,00,494); ఎస్సీలు – 14.06 శాతం ( 63,629); ఎస్టీలు – 9.6 శాతం (9458).

వివరాలకు : gramasachivalayam.ap.gov.in, wardsachivalayam.ap.gov.in

Related posts