telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

ఇసుక దొంగతనం కేసులో మూడేళ్ల జైలు శిక్ష

New couples attack SR Nagar

ఇసుకను అక్రమంగా నిల్వ, అక్రమంగా రవాణాను అరికట్టేందుకు ఏపీ కేబినేట్ కఠిన చర్యలు తీసుకునేలా చట్ట సవరణ చేసేందుకు ఈ నెల 13న రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇసుక దొంగతనం కేసులో ఓ వ్యక్తికి కడప కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది.

ప్రజల ఆస్తికి నష్టం కలిగించినందుకు ప్రజా ఆస్తి విధ్వంస నిరోధక చట్టం (పీఓపీపీడీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా కూడా విధించింది. ఈ రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కడప జిల్లా రెండో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ పి.భానుసాయి రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు.

Related posts