telugu navyamedia
రాజకీయ వార్తలు

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేత.. ఉత్తర్వులు జారీచేసిన కేంద్రం

మహారాష్ట్రలోన్ రాజకీయ అనిచ్ఛితికి ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. భారతీయ జనతా పార్టీ.. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీతో కలిసి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రభుత్వ ఏర్పాటుపై నిన్న రాత్రి వరకు ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

నవంబర్ 12వ తేదీన ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ- కాంగ్రెస్- శివసేన మధ్య చర్చలు జరుగుతుండగానే.. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ సిఫారసు చేయడం.. కేంద్ర క్యాబినెట్ సమ్మతించి, రాష్ట్రపతికి పంపడం.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపిన విషయం విధితమే.

Related posts