తెలంగాణ ప్రభుత్వం కార్మిక శాఖలోని పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ శాఖలో 28 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. మొత్తం 28 పోస్టుల్లో.. 7 అసిస్టెంట్ కమిషనర్, ఒక అసిస్టెంట్ డ్రాఫ్ట్స్‌మెన్, 3 స్టెనోగ్రాఫర్, ఒక జూనియర్ స్టెనోగ్రాఫర్, 16 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అనుమతి ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీ టీఎస్ పీఎస్ ద్వారా జరగనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
next post
జగన్ కేబినెట్ లో రోజాకు స్థానం కలిపిస్తే బాగుండేది: విజయశాంతి