telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక

భారత డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు .. అమ్మకాలు.. అతిపెద్ద హ్యాకింగ్ .. జరభద్రం!

indian credit and debit cards hacked

జీరో అకౌంట్ తో బ్యాంకు ఖాతాలు, తద్వారా డెబిట్ కార్డులు లేని వారు ఉండరు. క్రెడిట్ కార్డులు ఉన్నవారు కూడా నేటి కాలంలో ఎక్కువే ఉన్నారు. ఉద్యోగం రాగానే ఈ కార్డు తీసుకోవడం, ఈఎంఐ కింద వస్తువులు కొనుక్కోవడం అలవాటు అయిపోయింది. దీనిని బట్టి భారతదేశంలో చాలా మందికి ఏదో ఒక కార్డు ఉంది, అందులో కూడా చాలా మందికి క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయి. ఇప్పటికే భారత్‌లోని 13 లక్షల మంది ఖాతాదారుల డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను హ్యాక్ చేయడమే కాదు.. దానికి సంబంధించిన వివరాలను ఏకంగా అమ్మకానికి పెట్టేశారట హ్యాకర్లు. ఈ మొత్తం సమాచారాన్ని జోకర్స్ స్టాష్ అనే డార్క్ వెబ్‌సైట్లలో ఇండియా- మిక్స్-న్యూ-1 పేరు కింద ఏకంగా రూ.6.74లక్షల కోట్లకు అమ్మేశారట. ఈ విషయాన్ని సింగపూర్‌కు చెందిన గ్రూప్-ఐబి భద్రతా పరిశోధన బృందం వెల్లడించింది. భారత్‌ ఎదుర్కొంటున్న అతిపెద్ద హ్యాక్‌ ఇదేనని వాళ్ళు చెబుతున్నారు.

మరో షాకింగ్ విషయం ఏంటంటే, హ్యాక్ చేసిన కార్డుల్లో 18 శాతం ఒకే బ్యాంకుకు చెందిన కార్డులే ఉన్నాయట. అంతేకాదు ఆ డేటాలో భారతీయ బ్యాంకులకు సంబంధించిన వివరాలు 98శాతం ఉన్నాయని అలాగే కొలంబియన్ బ్యాంక్‌కు చెందిన వివరాలు 1శాతం ఉన్నాయని వెల్లడించారు. కార్డ్ నంబర్, సీవీవీ నంబర్, గడువు తేదీలు, ఖాతాదారుల పేర్లుతో కూడిన వివరాలన్నీ హ్యాకర్లు అమ్మినట్లు వారు తెలిపారు. స్కిమింగ్ టెక్నిక్‌ను ఉపయోగించిన ఈ డేటాను వారు హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటి నుంచైనా అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. ఈ హ్యాకింగ్‌పై భారతీయ బ్యాంకులు స్పందించి.. వారి వారి ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేయాలని ఆ సంస్థ వెల్లడించింది.

Related posts