సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది.
45-60 సంవత్సరాల వయసున్న మహిళకు మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈనెల 22న వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ స్కీమ్ కు రూ.4700 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ అమలుకు రూ.4020 కోట్లు రుణం తీసుకునేందుకు ఆమోదం లభించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ర్యాటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు.
వీటితో పాటు గ్రామ సచివాలయంలో 85 కొత్త పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎనిమిదో తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వీరికే కాకుండా వారికి పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు కూడా ట్యాబ్‌లు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అలాగే నెల్లూరు, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్‌ల ఏర్పాటు ప్రతిపాదనలపై కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఒక్కో లోక్ అదాలత్‌లకు పది పోస్టులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 15వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఎలాంటి బిల్లులు పెట్టాలి… ఏపీ ఛారిటబుల్, హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన సవరణ బిల్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
గ్రేటర్ విశాఖలో లక్ష ఇళ్ల నిర్మాణం, 21.30 లక్షల మందికి ఇళ్లు కేటాయింపు, వర్సిటీలో అధ్యాపకుల కోసం నెట్ పాస్ నిబంధన, పాణ్యంలో డిగ్రీ కళాశాల మంజూరు, పాడేరు గిరిజన వర్సిటీలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది భర్తీ చేయాలని నిర్ణయించారు.
ఈ వర్సిటీలో 80 మంది రెగ్యులర్, 48 మంది నాన్ టీచింగ్ సిబ్బంది, దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు ఆమోదం లభించింది. మున్సిపల్ పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం, సీఆర్డీఏ అభివృద్ధికి రూ.1600 కోట్ల రుణానికి ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ, సీఆర్‌డీఏ చట్టంలోని ఓ క్లాజ్‌లో మార్పులు చేశారు.
పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోను: చంద్రబాబు